'మోడీ దిగిపోతేనే ఏపీకి హోదా'

'మోడీ దిగిపోతేనే ఏపీకి హోదా'

70 రోజుల తర్వాత ప్రధానిగా మోడీ దిగిపోవడం ఖాయమని.. కొత్త ప్రభుత్వం రాగానే ప్రత్యేక హోదా సాధిస్తామని ఏపీ మంత్రి లోకేష్‌ అన్నారు. ఇవాళ ఢిల్లీలో ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ ఏపీ ప్రజలకు మోడీ వెన్నుపోటు పొడిచారని అన్నారు. కేంద్రాన్ని నమ్మి తప్పుచేశామని చెప్పారు. కేంద్రాన్ని నిలదీసే హక్కు రాజ్యాంగం ఇచ్చిందన్న లోకేష్‌.. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు పోరడతామన్నారు. మోడీ.. జగన్‌ల వ్యవహారం గుంటూరు సభతోనే తెలిసిపోయిందని.. ప్రధానికి స్వాగతం పలుకుతూ ఏపీలో వైసీపీ ఫ్లెక్సీలు పెట్టిందని అన్నారు. తనపై మోడీ చేసిన విమర్శలపై స్పందిస్తూ.. తనపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి బీజేపీ మోసం చేసిందని.. అందుకే కాంగ్రెస్‌తో కలిసి అడుగులు వేస్తున్నామన్నారు. అవినీతిపరులను జైలుకు పంపిస్తానన్న మోడీ.. జగన్‌ను ఎందుకు వదిలిపెడుతున్నారని లోకేష్‌ ప్రశ్నించారు.