ఏరీ.. జగన్‌ ఎక్కడ?: లోకేష్

ఏరీ.. జగన్‌ ఎక్కడ?: లోకేష్

'ప్రధాని మోడీ ఏపీ పర్యటన సందర్భంగా రాష్ట్రమంతా ఒక్కటై రోడ్డెక్కి హోదా కోసం పోరాడుతుంటే ప్రతిపక్ష నేత జగన్ ఎక్కడ? వైకాపా నాయకులు ఎక్కడ?' అని మంత్రి లోకేష్‌ ప్రశ్నించారు. ఈమేరకు ఇవాళ ఆయన ట్వీట్‌ చేశారు. '26 కేసులకు బయపడి జగన్ దాక్కున్నారా?అరెస్ట్ చేసి జైలుకి పంపుతారు అని భయం పట్టుకుందా? లేక లోటస్ పాండ్‌లో పడుకున్నారా?' అని ఎద్దేవా చేశారు. ఆంధ్రులు చేస్తున్న పోరాటానికి మద్దతు పలకక పోగా మోడీతో జగన్‌ జోడీ కట్టారని.. వైసీపీ కార్యకర్తలను మోడీ సభకు పంపిస్తున్నారని లోకేష్‌ అన్నారు. 

ప్రధాని మోడీ గుంటూరు పర్యటన నేపథ్యంలో 'ఎక్కడ దాక్కున్నావ్ జగన్' పేరుతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని ఇవాళ ఉదయం సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా, విభజన హామీలకు ప్రతీకగా రెండు ఖాళీ కుండలతో నిరసన చేపట్టాలని.. వాటిని బద్దలు కొట్టి ఏపీ ప్రజల ఆగ్రహాన్ని మోదీకి తెలియపరచాలని నేతలకు చెప్పారు.