జాతీయ రహదారిపై లారీ హైజాక్

జాతీయ రహదారిపై లారీ హైజాక్

నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం జాతీయ రహదారిపై ఓ లారీని గుర్తుతెలియని దుండగులు హైజాక్ చేశారు. చెన్నై నుండి మిర్యాలగూడకు కెమికల్ లోడుతో బయల్దేరిన లారీని మార్గమధ్యలో దుండగులు ఆటకాయించారు. మొత్తం సరుకుని మరొ లారీలోకి ఎక్కించుకుని చిల్లకూరు క్రాస్ రోడ్ వద్ద లారీని వదిలివెళ్లారు. అయితే లారీ డ్రైవర్ ను కారులో ఎక్కించుకొని దాడి చేసారు. అనంతరం లారీ డ్రైవర్ ను ఓజిలి హైవేపై తొసి దుండగులు పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గుర్తుతెలియని దుండగులు దొంగిలించిన సరుకు పేలే స్వభావం ఉండటంతో పోలీసులు ఆందోళనలో ఉన్నారు.