ప్రియురాలు లేదని...

ప్రియురాలు లేదని...

ప్రేమించుకున్న ఆ ఇద్దరు కలిసి జీవించలేకపోయారు... కనీసం చావులోనైనా ఒకటి కావాలనుకున్నారేమో... ఓవైపు ప్రియురాలు విషం తాగి ఇంట్లో ఆత్మహత్య చేసుకుంటే... ఆమె మరణవార్తను జీర్ణించుకోలేకపోయిన ప్రియు రైలు కింద పడి తనువు చాలించాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాల గ్రామంలో విషాదాన్ని నిపింది. స్థానిక సమాచారం ప్రకారం విక్రమ్, సుస్మిత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుస్మిత నిన్న రాత్రి విషంతాగి ఆత్మహత్య చేసుకోగా... తన ప్రేయసి మరణవార్తను దిగమింగుకోలేని విక్రమ్... ఆత్మకూరు మండలంలోని శ్రీరామ్ నగర్ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయగా... పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.