పార్టీ మారనుగాక మారను..

పార్టీ మారనుగాక మారను..

టీఆర్‌ఎస్‌లో తాను చేరుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని  టీడీపీ నేత, అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తెలిపారు. తాను తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును తాను కలవడంతో పార్టీ మారుతున్నట్టు వార్తలు వస్తున్నాయని.. వాటిని తాను ఖండిస్తున్నానని చెప్పారు. తన రాజకీయ గురువు  తుమ్మలను ఒక శిష్యుడిగా మర్యాదపూర్వకంగా కలశానని అన్నారు. అంతేతప్ప తమ కలయికలో ఎటువంటి రాజకీయ కారణాలూ లేవని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున తాను గెలిచానని.. అదే పార్టీలో ఉంటానని అన్నారు. 34 ఏళ్ల నుంచి చంద్రబాబునాయుడు తనకు ఎనలేని గుర్తింపునిచ్చారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.