బీజేపీలోకి మాధవీలత

బీజేపీలోకి మాధవీలత

పవన్‌పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై భగ్గుమనడంతో పాటు క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసి.. ఈ మధ్య వార్తల్లో బాగా నానుతున్న సినీనటి మాధవీలత ఎట్టకేలకు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఇవాళ కేంద్రమంత్రి నితిన్ గట్కరీ, సీనియర్ నేత బండారు దత్తాత్రేయ సమక్షంలో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. అయితే శ్రీరెడ్డి వ్యవహారంలో పవన్‌కు మద్ధతు తెలపడం.. ఫిలిం ఛాంబర్ వద్ద ఏకంగా నిరసన చేపట్టడం వంటి ఘటనలతో మాధవీలత జనసేనలో చేరుతారని ప్రచారం జరిగింది. అయితే ఆమె అనూహ్యంగా భారతీయ జనతా పార్టీలో చేరడం గమనార్హం. 2008లో నచ్చావులే చిత్రం ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా మెరిసినప్పటికీ.. టాప్ స్టార్ కాలేకపోయారు.