కూటమికి 26 సీట్లు.. 10న మొదటి జాబితా

కూటమికి 26 సీట్లు.. 10న మొదటి జాబితా

ఈ నెల 10న మహాకూటమి మొదటి జాబితా విడుదల కానుంది. కాంగ్రెస్ మొత్తం 94 స్థానాల్లో పోటీ చేయనుంది. 26 సీట్లను మహాకూటమి భాగస్వామ్య పార్టీలకు కేటాయించింది. ఈ మేరకు ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్ ఖుంతియా ప్రకటించారు. గురువారం రాహుల్ నివాసంలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం సుమారు రెండు గంటలపాటు జరిగింది. ఈ భేటీలో కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. 10న ఉదయం తొలి జాబితాను విడుదల చేయాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. 74 మందితో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల కానుంది. మిగిలిన 20 మంది జాబితా రెండో జాబితాలో విడుదలవుంది. దీనికోసం ఈ నెల 11, 12 న మరో విడుత కాంగ్రెస్ సీఈసీ సమావేశం కానుంది

మహాకూటమి భాగస్వామ్య పార్టీలకు కేటాయించిన 26 సీట్లలో టీడీపీకి 14, టీజేఎస్ కి 8, సీపీఐకి 3 సీట్లను కేటాయించారు. ఒక స్థానం తెలంగాణ ఇంటి పార్టీకి ఇచ్చే అవకాశం ఉంది. సీపీఐకి వైరా, హుస్నాబాద్, బెల్లంపల్లిలను ఖరారు చేసింది. రేపు సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది.