బాలీవుడ్‌ విలన్‌ అనుమానాస్పద మృతి

బాలీవుడ్‌ విలన్‌ అనుమానాస్పద మృతి

ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేష్‌ ఆనంద్ (57) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ముంబైలోని అంధేరి యారీ రోడ్డులోని స్వగృహంలో ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆయన మృతికి గల కారణాలు తెలియరాలేదు. భార్య నుంచి విడాకులు తీసుకున్నాక ఆనంద్ ముంబైలో ఒంటరిగానే నివసిస్తున్నారని ఆయన సన్నిహితులు చెప్పారు.  సినిమాల్లో అవకాశాలు తక్కువగా ఉండటంతో ఆదాయం సరిపోక వ్యాపారం చేసిన ఆయన.. అక్కడా నష్టపోయారని తెలిసింది.

ఇక.. శెహన్‌షా, మజ్‌బూర్, స్వర్గ్, తనీదార్, విజేత, కురుక్షేత్ర వంటి సినిమాల్లో విలన్‌గా మెప్పించారు మహేష్‌. తెలుగులో ఎస్వీ కృష్ణారెడ్డి  తీసిన 'నంబర్‌ వన్‌' సినిమాలో వెరైటీ విలనిజంతో ఆకట్టుకున్నారు.  లంకేశ్వరుడు, ఎస్పీ పరుశురాం, టాప్‌హీరో చిత్రాల్లోనూ నటించారు. గోవింద హీరోగా నటించిన రంగీలా రాజా ఆయన చివరి సినిమా. ఈ చిత్రం జనవరి 18న విడుదల అయింది.