మహేష్ మరో రెండు చేస్తాడా..?

మహేష్ మరో రెండు చేస్తాడా..?

భరత్ అనే నేను తరువాత మహేష్ బాబు చేస్తున్న సినిమా మహర్షి.  ఈ సినిమా ఏప్రిల్ 5 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలు, ఫస్ట్ లుక్ టీజర్ రీసెంట్ గా రిలీజ్ చేశాడు.  ఇవి బాగా ఆకట్టుకోవడంతో నెక్స్ట్ ఏంటి అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.  వంశి పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.  మూడు వేరియేషన్స్ లో మహేష్ కనిపిస్తున్నాడు.  

ఈ సినిమా తరువాత మహేష్ సుకుమార్ తో సినిమా చేసేందుకు కమిట్ అయినా.. కథ ఇంకా ఫైనల్ కాలేదు.  సుకుమార్ తో కొందరు యువ దర్శకులు కథలు కూడా వింటున్నాడట.  ఇంతకు మహేష్ లైన్ నచ్చితే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవాడు.  పూర్తి స్క్రిప్ట్ వినకుండానే ఓకే చేసేవారు.  అది దర్శకుల మీదున్న నమ్మకం.  

బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాల తరువాత మహేష్ స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  పూర్తి స్క్రిప్ట్ తో వచ్చి కథ చెప్పిన వాళ్ళకే అవకాశం ఇస్తున్నారు.  ఈ ఏడాది మహర్షి కాకుండా మరో రెండు సినిమాలు చేయాలని మహేష్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది.  స్క్రిప్ట్ సిద్ధంగా ఉండి, నచ్చితే చాలు సినిమా చేసేందుకు మహేష్ సిద్ధంగా ఉన్నారు.  మరి మహేష్ లక్ష్యం నెరవేరుతుందా.. చూద్దాం.