నో రెస్ట్ అంటున్న మహేష్..!!

నో రెస్ట్ అంటున్న మహేష్..!!

మహేష్ 25 వ సినిమా మహర్షి షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  హైదరాబాద్ లో షూట్ కంప్లీట్ చేసుకొని త్వరలోనే విదేశాలకు వెళ్ళబోతున్నది.  అనుకున్న సమయానికి షూట్ కంప్లీట్ చేయాలనే కృత నిశ్చయంతో యూనిట్ ఉన్నది.  సెప్టెంబర్ నెలాఖరుకు యూఎస్ షెడ్యూల్ కు వెళ్లాల్సి ఉన్నది.  దీంతో వినాయక చవితి రోజున కూడా షూటింగ్ చేయాలని యూనిట్ నిర్ణయించింది.  

పూజా హెగ్డే, అల్లరి నరేష్ ప్రధాన పాత్రధారులుగా చేస్తున్న ఈ సినిమాకు వంశి పైడిపల్లి దర్శకుడు.  దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5 న విడుదల కాబోతున్నది.