ఆ దేశంలో మరణ శిక్ష రద్దు

ఆ దేశంలో మరణ శిక్ష రద్దు

మరణశిక్షను రద్దు చేయటానికి మలేషియా ఓకే చెప్పింది. ఇప్పటి వరకు ఆదేశంలో టెర్రరిజం,హత్య,కిడ్నాప్, డ్రగ్స్ సరఫరా లాంటి నేరాలకు మరణ శిక్ష విధిస్తారు. అయితే.. ప్రపంచంలో ఇటీవల వస్తున్న మార్పులతో ఆ దేశం మరణశిక్షను రద్దు చేయటానికి అంగీకరించింది. ఆ దేశంలో ఉరి శిక్షపై వస్తున్న తీవ్ర వ్యతిరేకత కారణంగా మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 
మలేషియా ప్రభుత్వ నిర్ణయాన్ని మానవ హక్కుల ఉద్యమకారులు స్వాగతించారు. ఇప్పటికే మలేషియాలో వివిధ నేరాలతో సంబంధం ఉందని సుమారు 1,200మందిని ఉరి శిక్షపడింది. అయితే వారని ఇంకా ఉరితీయలేదు. మలేషియాలో ఈ ఏడాది ఎన్నికలు ఉన్నాయి. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నారని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పుడు దేశంలో ఉరిశిక్ష రద్దైతే.. విదేశాల్లో మలేసియన్లకు మరణశిక్ష విధించే సందర్భాల్లో దాన్ని అడ్డుకునే నైతిక అధికారం ఉంటుందని ఆయన అన్నారు.