11 ఏళ్ల బాలికపై అఘాయిత్యం...!

11 ఏళ్ల బాలికపై అఘాయిత్యం...!

కఠిన చట్టాలు వచ్చినా... పొక్సో లాంటి చట్టాలకు సవరణలు చేసి బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడితే మరణశిక్ష విధించాలనే నిర్ణయం తీసుకున్నా... చిన్నారులపై లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలు ఆందోళన కలిగిస్తుండగా... హైదరాబాద్‌లో మరో మృగాడు 11 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. కాప్రా సర్కిల్ జమ్మిగడ్డ శివసాయి నగర్ కాలనీలో ఈ దారుణం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎదిరింట్లో ఉండే 11 ఏళ్ల చిన్నారికి చాక్లెట్లు ఇస్తానని ఆశ చూపి తన ఇంట్లోకి పిలిచి అత్యాచారం చేసేందుకు యత్నించాడు... ఇది గమనించిన స్థానికులు బాలికను రక్షించి నిందితుడికి దేహశుద్ధి చేసి... జవహర్ నగర్ పోలీసులకు అప్పగించారు.