మహానటి నెక్స్ట్ టార్గెట్ అదే..!

మహానటి నెక్స్ట్ టార్గెట్ అదే..!

 మహానటి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన మహానటి సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్నది.  ఇప్పటికే ఈ సినిమా యూఎస్ లో 2.5 మిలియన్ డాలర్లు వసూలు చేసి ఆరో స్థానంలో కొనసాగుతోంది.  ఖైదీ నెంబర్ 150, త్రివిక్రమ్ అ..ఆ సినిమాల రికార్డులను మహానటి ఇప్పటికే బీట్ చేసింది.  ఇప్పుడు మహానటి మహేష్ బాబును టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది.  మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా యూఎస్ లో 2.89 మిలియన్ డాలర్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే.  మహేష్ శ్రీమంతుడుని టార్గెట్ చేసిన మహానటి.. లాంగ్ రన్ లో తప్పకుండా బీట్ చేస్తుందని సినీ విశ్లేషకులు చెప్తున్నారు.  

మహానటి సినిమా యుఎస్ లో ఇప్పటికి కొన్ని లొకేషన్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శితమౌతున్నది.  ఇటు టాలీవుడ్, కోలీవుడ్ లో కూడా ఈ సినిమా మంచి  చేసుకున్న సంగతి తెలిసిందే.  సావిత్రి బయోపిక్ ఇచ్చిన స్పూర్తితో చాలా సినిమాలు రాబోతున్నాయి.