మంచు హీరోతో 'గీత గోవిందం' దర్శకుడు !

మంచు హీరోతో 'గీత గోవిందం' దర్శకుడు !

నిన్న విడుదలైన 'గీత గోవిందం' చిత్రం మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని నడుస్తున్న సంగతి తెలిసిందే.   సినిమా చూసిన ప్రేక్షకులంతా దర్శకుడు పరశురామ్ దర్శకత్వ ప్రతిభను తెగ మెచ్చుకుంటున్నారు.  ఆయనకు ఆఫర్లు కూడా వెల్లువెత్తుతున్నాయి.  

ఇప్పటికే మంచు విష్ణుతో ఆయన సినిమా ఒకటి ఓకే అయినట్టు సమాచారం.  విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మోహన్ బాబుగారు దగ్గరుండి ఈ ప్రాజెక్ట్ సెట్ చేశారని, దీన్ని ఆయనే నిర్మిస్తారని అంటున్నారు.  అయితే దీనికి సంబందించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.  మరోవైపు గీతా ఆర్ట్స్ సంస్థలో కూడ ఒక సినిమా చేయనున్నాడు పరశురామ్.