పవన్ చేసిన పనికి మంచు మనోజ్ హ్యాపీ !

పవన్ చేసిన పనికి మంచు మనోజ్ హ్యాపీ !

పవన్ కళ్యాణ్ జనసన పార్టీని బలోపేతం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు.  అందులో భాగంగానే ఆయన పలువురు ప్రముఖుల్ని పార్టీలో చేర్చుకుంటున్నారు.  ఇప్పటికే ఆయన బివి రాజు ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన విష్ణు కుమార్ రాజు, ఎకనామిస్ట్ పుల్లారావు, అబ్దుల్ కలాం వద్ద  సైన్టిఫిక్ అడ్వైజర్ గా పనిచేసిన పొన్రాజ్, మాజీ డీఐజీ రవికుమార్ మూర్తి, ప్రొఫెసర్ సుధాకర్ రావ్ లాంటి ఉన్నత విద్యావంతుల్ని పార్టీలో చేర్చుకున్నారు. 

పవన్ ఇలా విద్యావంతులకు, మేధావులకు పార్టీలో సముచిత స్థానం ఇస్తున్నందుకు పలువురు ఆయన్ను అభినందిస్తుండగా సినీ హీరో మంచు మనోజ్ సైతం హర్షం వ్యక్తం చేశాడు.  ఇలా ప్రజలకి సేవ చేయడానికి విద్యావంతుల్ని కలిగి ఉండటం నిజంగా గొప్ప విషయమని, పవన్ సర్ చేసిన పనికి తాను సూపర్ హ్యాపీగా ఉన్నానని పొగిడేశాడు.