కాంగ్రెస్‌, టీడీపీ వేర్వేరు కాదు

కాంగ్రెస్‌, టీడీపీ వేర్వేరు కాదు

తెలుగుదేశం, కాంగ్రెస్ వేర్వేరు కాదని మరోసారి రుజువైందని బీజేపీ నేత పైడికొండ మాణిక్యాలరావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇవాళ ఆయన మట్లాడుతూ రాజ్యసభలో డిప్యూటీ స్పీకర్ ఓటింగ్ విషయంలో కాంగ్రెస్‌కు టీడీపీ మద్దతివ్వడమే దీని నిదర్శనమన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్‌.. టీడీపీని స్థాపించారని.. ఇప్పుడు అదే పార్టీతో చంద్రబాబు అంటకాగుతున్నారని మాణిక్యాలరావు విమర్శించారు. జీఎస్టీకి ప్రధాన ఆదాయ వనరు అయిన ఆక్వా రంగం విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం మానిఫెస్టోలో పెట్టిన అంశాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు.