షూటింగ్ లో గాయపడ్డ టాప్ హీరోయిన్

షూటింగ్ లో గాయపడ్డ టాప్ హీరోయిన్

సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా ఎదిగారు.  మలయాళంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు ఆయన దర్శకత్వం వచించారు.  ప్రస్తుతం సంతోష్ శివన్ దర్శకత్వంలో మలయాళంలో జాక్ అండ్ జిల్ అనే సినిమా తెరకెక్కుతున్నది.  ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా హీరోయిన్ మంజూ వారియర్ గాయపడింది.  యాక్షన్స్ సీన్స్ చిత్రీకరిస్తుండగా ఆమె తలకు బలమైన గాయం అయింది.  వెంటనే సిబ్బంది ఆమెను దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు తీసుకెళ్లగా.. గాయానికి కుట్లు వేసినట్టుగా సమాచారం.  మంజూ వారియర్ కోలుకున్నాక తిరిగి షూటింగ్ ప్రారంభం అవుతుందని యూనిట్ తెలియజేసింది.  కాళిదాస్ జయరాం ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు.