లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత

లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత

మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఉన్న సుధాకర్ లొంగిపోయారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్న సుధాకర్... ఇవాళ రాంచీ పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు తెలుస్తోంది. 2013 నుంచి కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు సుధాకర్, ఆయన భార్య మాధవి. జార్ఖండ్ మావోయిస్టు కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పనిచేస్తూ వచ్చారు సుధాకర్, ఆయన స్వస్థలం తెలంగాణలోని నిర్మల్ జిల్లా సారంగాపూర్‌. సుధాకర్ అలియాస్ కిరణ్‌గా ఆయనను పిలుస్తారు. కాగా, సుధాకర్‌పై కోటి రూపాయల రివార్డు ఉంది.