పీఎస్‌కు వచ్చి మావోయిస్టుల వార్నింగ్...

పీఎస్‌కు వచ్చి మావోయిస్టుల వార్నింగ్...

వరుస ఎదురుదెబ్బలతో సతమతమవుతోన్న మావోయిస్టు పార్టీ... విధ్వంసానికి దిగుతోంది... మొన్నటిమొన్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు నిప్పుపెట్టి నిరసన తెలిపిన మావోయిస్టులు... నిన్న ఛత్తీష్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లా బచేలి దగ్గర ఐదు లారీలను దగ్ధం చేశారు... మరోవైపు దంతవాడలో జరుగుతున్న పైపులైను పనులను వెంటనే ఆపివేయాలంటూ కుఅకొండా పోలీస్ స్టేషన్‌కు వచ్చి వార్నింగ్ ఇచ్చారు మావోయిస్టులు... సుమారు ఏడు నుంచి ఎనిమిది మంది మావోయిస్టులు ఆయుధాలతో కుఅకొండా పోలీస్ స్టేషన్ ని చుట్టు ముట్టి  హెచ్చరిక చేసి... అనంతరం జేసీబీకి నిప్పటించినట్టు సమాచారం.