మనసున్న మారాజుకు 'మరాజో' కానుక

మనసున్న మారాజుకు 'మరాజో' కానుక

కేరళలో ఇటీవల సంభవించిన వరదలలో తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించి ఒక్కసారిగా హీరోగా మారిన మత్స్యకారుడు జైసాల్ గురించి మనందరికి తెలిసిందే. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది వెళ్లలేమన్న ప్రాంతాలకు సైతం వెళ్లి ముగ్గురి ప్రాణాలను కాపాడాడు జైసల్‌. వెంగారలోని ముథాలమాద్ ప్రాంతంలోని ఒక ఇంటిలో ఒక చిన్నారితోపాటు ముగ్గురు మహిళలను కాపాండేందుకు వెళ్లలేమని ఎన్డీఆర్‌ఎఫ్ చేతులెసింది. ఏం పర్లేదు.. నేనెళ్తా అంటూ జైసాల్ ముందుకొచ్చి వారిని కాపాడాడు. జైసాల్ తన వీపును మెట్టుగాచేసి బోటులోకి వెళ్లేందుకు వీలుగా కిందకు వంగితే.. ఒకరి తర్వాత మరొకరు అతడి వీపుపై కాలుపెట్టి బోటులోకి వెళ్లిపోయారు. 

అయితే వరద నీటిలో చిక్కుకున్న వారిని రక్షించినందుకు కేరళ రాష్ట్రం, కాలికట్ లోని ఎరామ్ మోటార్స్ షోరూమ్ వారు జైసల్ కు ఇటీవలే మార్కెట్ లోకి విడుదలైన మహీంద్రా మారాజో ఎస్ యూ వీ వెహికిల్ ను గిఫ్ట్ గా ఇచ్చింది. ఈ విషయాన్ని నిర్వహకులు ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. జైసల్ ప్రదర్శించిన దైర్య సాహసాల్ని ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు. దానికి సంబంధిత దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.