అమెరికా నిర్ణయంతో నిఫ్టికి నష్టాలు

అమెరికా నిర్ణయంతో నిఫ్టికి నష్టాలు

వడ్డీ రేట్లను పెంచాలన్న అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ నిర్ణయంతో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి పెరుగుతోంది. వడ్డీ రేట్లను పెంచడంతో పాటు ఈ ఏడాదిలో మరో రెండు సార్లు పెంచే అవకాశాలు ఉన్నాయని ఫెడరల్‌ రిజర్వ్‌ తేల్చడంతో రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. నష్టాలు స్వల్పంగానే ఉన్నా.. ఆసియా మార్కెట్లలో ఒత్తిడి అధికంగా కన్పిస్తోంది. అన్ని మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. జపాన్‌ నిక్కీ, హాంగ్‌సెంగ్‌లు అరశాతం నష్టంతో ట్రేడవుతుండగా ఇతర మార్కెట్లు ఇంతకన్నా అధిక నష్టంతో ట్రేడవుతున్నాయి. నిఫ్టి కూడా 30 పాయింట్ల నష్టంతో 10,827 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి 50లో 32 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అమెరికా ఫ్యూచర్స్‌ నిలకడగా ఉండటంతో ఆసియాలో పతనం పరిమితంగా ఉందని చెప్పొచ్చు. నిఫ్టి గెయినర్స్‌లో మెజారిటీ షేర్లు ఫార్మా  రంగానివే. డాక్టర్‌ రెడ్డీస్‌, సిప్లా, లుపిన్‌, సన్‌ ఫార్మా లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో ఐఓసీ, అల్ర్టాటెక్‌, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌పీసీఎల్‌ ఉన్నాయి.