భారీ అమ్మకాలుః నిఫ్టి 91 పాయింట్స్‌ డౌన్‌

భారీ అమ్మకాలుః నిఫ్టి 91 పాయింట్స్‌ డౌన్‌

మెటల్‌, ఫార్మా మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లలో ఇవాళ భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. కంపెనీ ఫలితాలు ప్రతికూలంగా ఉండటంలో అనేక షేర్లు భారీ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఇటీవల పెరిగిన షేర్లలో కూడా భారీ ఎత్తున లాభాలు స్వకరించడంతో నిఫ్టి 91 పాయింట్లు క్షీణించి 10831 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 336 పాయింట్లు తగ్గింది. ఉదయం 10931 వద్ద ప్రారంభమైన నిఫ్టికి ఆరంభంలోనే అమ్మకాల ఒత్తిడి వచ్చింది. 10900 దిగువకు వచ్చిన వెంటనే కాస్త మద్దతు అందడంతో 10927కి చేరింది. అయితే మిడ్ సెషన్‌ నుంచి మార్కెట్‌లో అమ్మకాల తీవ్రత భారీగా పెరిగింది. దీంతో నిప్టి నిరాటంకంగా పడుతూ వచ్చి 10831 వద్ద ముగిసింది. బీమా రంగ కంపెనీల ఫలితాలు కూడా సోసోగా ఉండటంతో ఆ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఐటీసీ షేర్‌ కూడా ఇవాళ 5 శాతం పడటం విశేషం. ఇవాళ నిఫ్టిలోని 31 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఇక ఇవాళ లాభాల్లో ముగిసిన నిఫ్టి షేర్లలో సన్‌ ఫార్మా, ఎస్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, విప్రో, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లు ఉన్నాయి.  నిఫ్టి షేర్లలో నష్టాలతో ముగిసిన షేర్లలో ఐటీసీ ముందుంది. ఈ షేర్‌ 4.75 శాతం నష్టంతో క్లోజ్‌ కాగా, తరువాత స్థానాల్లో ఐటీసీ, గ్రాసిం,  ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, టైటాన్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా ఉన్నాయి.