నిఫ్టిః న‌ష్టాల‌తో ప్రారంభం

నిఫ్టిః న‌ష్టాల‌తో ప్రారంభం

మార్కెట్ సెంటిమెంట్ చాలా బ‌ల‌హీనంగా ఉంది. బ‌డ్జెట్ ముందు జాగ్ర‌త్త ఇన్వెస్ట‌ర్ల‌లో క‌న్పిస్తోంది. గోయెల్ స‌మ‌ర్పించే బ‌డ్జెట్‌పై మార్కెట్‌లో పెద్ద ఆశ‌లు లేవు. మార్కెట్లో డెరివేటివ్ వ్యూహాల‌న్నీ పుట్స్ ఆధారంగా తీసుకోవ‌డ‌మే దీనికి కార‌ణం. అంత‌ర్జాతీయంగా కూడా ప‌రిస్థితి బాగా లేదు. అమెరికా మార్కెట్లు రాత్రి ఒక‌శాతంపైగా న‌ష్టంతో ముగిశాయి. ఆసియా మార్కెట్ల‌దీ అదే దారీ. దాదాపు అన్ని మార్కెట్లు ఒక మోస్త‌రు న‌ష్టాల‌తో ట్రేడ‌వుతున్నాయి. డాల‌ర్ ఇండెక్స్ స్థిరంగా ఉంది.  వెనిజులాపై అమెరికా ఆంక్ష‌లు విధించినా...  క్రూడ్ ధ‌ర‌ల్లో పెద్ద మార్పుల్లేవు. కార‌ణంగా ఆర్థిక‌వృద్ధిపై ఆశ‌లులేక‌పోవ‌డ‌మే. ఈ నేప‌థ్యంలో మ‌న మార్కెట్లు ఓపెనింగ్‌లో 10,616కి ప‌డిపోయిన నిఫ్టి త‌ర‌వాత కోలుకుని ఇపుడు లాభాల్లోకి వ‌చ్చింది. మెజారిటీ షేర్లు న‌ష్టాల్లో ఉన్నాయి. నిఫ్టి షేర్ల‌లో అదానీ పోర్ట్స్ గెయిన‌ర్స్‌లో టాప్‌లో ఉంది. నిన్న అదానీ గ్రూప్ షేర్లు భారీగా న‌ష్ట‌పోయాయి. నిఫ్టి షేర్ల‌లో లాభాల్లో ఉన్న‌వాటిలో అల్ట్రాటెక్ సిమెంట్‌, స‌న్ ఫార్మా, డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్‌, ఐసీఐసీఐ బ్యాంక్ ఉన్నాయి.  ఎన్‌బీఎఫ్‌సీల‌లో అమ్మ‌కాలు కొన‌సాగుతున్నాయి. నిఫ్టి షేర్ల‌లో భారీ న‌ష్టాల్లో ఉన్నవాటిలో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ టాప్‌లో ఉంది. త‌ర‌వాతి స్థానాల్లో గెయిల్‌, బీపీసీఎల్‌, యూపీఎల్‌, రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ ఉన్నాయి. ఇక చురుగ్గా ట్రేడ‌వుతున్న షేర్ల‌లో అదానీ ప‌వ‌ర్ షేర్లు కూడా ఏడు శాతం లాభం పొందాయి.