లాభాల‌తో నిఫ్టి ప్రారంభం

లాభాల‌తో నిఫ్టి ప్రారంభం

అంత‌ర్జాతీయ మార్కెట్ల సానుకూల‌తల కార‌ణంగా నిఫ్టి లాభాల‌తో ప్రారంభ‌మైంది. రాత్రి అమెరికా మార్కెట్లు స్థిరంగా ముగిశాయి. అంత‌కుమునుపు యూరో మార్కెట్లు కూడా లాభాల‌తో ముగిశాయి. డాల‌ర్ ఇండెక్స్‌లో మార్పు లేకున్నా.. రాత్రి క్రూడ్ ధ‌ర‌లు స్వ‌ల్పంగా పెరిగాయి. డాల‌ర్‌తో  రూపాయి 20పైస‌లు క్షీణించింది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉన్న జ‌పాన్ నిక్కీ న‌ష్టాల్లో ఉండ‌టం, ఇత‌ర మార్కెట్ల లాభాలు నామ మాత్రంగా ఉండ‌టంతో... మ‌న మార్కెట్ల లాభాలు ఎంత వ‌ర‌కు కొన‌సాగుతాయో చూడాల్సి ఉంది. కార్పొరేట్ ఫ‌లితాల సీజ‌న్ ముగింపుకు వ‌స్తుండ‌టం, రోజుకో కొత్త స్కామ్ బ‌య‌ట‌కు వ‌స్తుండ‌టంతో అనేక షేర్లు భారీగా న‌ష్ట‌పోతున్నాయి. హెచ్ ఈజీ, గ్రాఫైట్ వంటి షేర్లు భారీ న‌ష్టాల‌తో ముగుస్తున్నాయి. డీహెచ్ ఎఫ్ ఎల్ షేర్ ఇవాళ కూడా మ‌రో 7 శాతం క్షీణించింది. ప్ర‌స్తుతం 50 పాయింట్ల లాభంతో 10702 వ‌ద్ద నిఫ్టి ట్రేడ‌వుతోంది. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో హెచ్‌సీఎల్ టెక్‌, యాక్సిక్ బ్యాంక్‌, బ‌జాజ్ ఫైనాన్స్‌, ఎస్ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు టాప్‌లో ఉన్నాయి. ఇక న‌ష్టాల్లో ట్రేడ‌వుతున్న నిఫ్టి షేర్ల‌లో అదానీ పోర్ట్స్‌, బీపీసీఎల్‌, హీరోమోటోకార్ప్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు ఉన్నాయి.