మూర‌త్ ట్రేడింగ్ సూప‌ర్‌

మూర‌త్ ట్రేడింగ్ సూప‌ర్‌

అమెరికా ఎన్నిక‌ల ప్ర‌భావం స్టాక్ మార్కెట్‌పై స్ప‌ష్టంగా క‌న్పించింది. హౌస్ ఆఫ్ రెప్ర‌జెంటేటివ్స్‌పై డెమొక్ర‌ట్స్ పూర్తి ఆధిక్యం సాధించ‌డంతో డాల‌ర్ ప‌రుగుకు ప‌గ్గం ప‌డింది. సెనేట్‌లో ట్రంప్ ప‌ట్టు సాధించినా.. ఇక దిగువ స‌భ అయిన హౌస్ ఆఫ్ రెప్ర‌జెంటేటివ్స్... ట్రంప్‌కు చెక్ పెట్ట‌డంలో స‌ఫ‌లం కావొచ్చు. మున్ముందు ట్రంప్ దూకుడుకు డెమొక్ర‌ట్లు క‌ళ్ళెం వేయొచ్చు. ఫ‌లితాలు స‌ర్వేలకు అనుగుణంగా ఉండ‌టం, డాల‌ర్ త‌గ్గ‌డంతో  యూరో మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడ‌వుతున్నాయి. అమెరికా ఫ్యూచ‌ర్స్ కూడా లాభాల‌ను సూచిస్తున్నాయి.ఈ నేప‌థ్యంలో జరిగిన మూర‌త్ ట్రేడింగ్‌లో అన్ని రంగాల సూచీలు పెరిగాయి. నిఫ్టి క్రితం ముగింపుతో పోలిస్తే 68 పాయింట్లు పెర‌గ్గా, సెన్సెక్స్ 245 పాయింట్లు పెరిగింది. ఇవాళ లాభాల‌తో ముగిసిన నిఫ్టి షేర్ల‌లో మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా, ఇన్ఫోసిస్‌, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఇన్‌ఫ్రాటెల్ షేర్లు ముందున్నాయి. ఇక అత్య‌ధికంగా న‌ష్ట‌పోయిన నిఫ్టి షేర్ల‌లో యాక్సిస్ బ్యాంక్‌, జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఉన్నాయి. ఇవి రెండూ కేవ‌లం నామ‌మాత్ర‌పు న‌ష్టాల‌తో ముగిశాయి. నిఫ్టిలోని 50 షేర్ల‌లో ఈ రెండు మాత్ర‌మే న‌ష్టాల్లో ముగిశాయి.. మిగిలిన షేర్ల‌న్నీ లాభాల్లో ముగిశాయి. ఇత‌ర షేర్ల‌లో ఇన్ఫీ బీమ్ 20 శాతం పెరిగింది.