టీ20 సిరీస్‌కు గప్టిల్‌ దూరం

టీ20 సిరీస్‌కు గప్టిల్‌ దూరం

భారత్‌తో టీ20 సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌ జట్టుకు ఎదురు దెబ్బ తగిలింది. చివరి వన్డేకు ముందు బ్యాక్ ఇంజురీతో దూరమైన స్టార్ ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌ ఇంకా కోలుకోలేదు. దాంతో అతను టీ20  సిరీస్‌ నుంచి తప్పుకున్నాడు. గప్టిల్‌ స్థానంలో ఆల్‌రౌండర్‌ జిమ్మీ నీషమ్‌ను ఎంపిక చేసినట్లు కివీస్‌ కోచ్ గ్యారీ స్టీడ్ తెలిపాడు.

'ఫిట్ నెస్ టెస్టులో గప్టిల్‌ ఫెయిల్ అయ్యాడు. టీ20 సిరీస్‌కు అతను  లేకపోవడం పెద్ద లోటు. బంగ్లాదేశ్ తో జరిగే వన్డే సిరీస్ కల్లా అందుబాటులో ఉండే అవకాశం ఉంది' అని గ్యారీ తెలిపాడు. భారత్, న్యూజిలాండ్‌ మధ్య బుధవారం మొదటి టీ20 జరగనుంది. అనంతరం 8న రెండో టీ20, 10న మూడో టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి.