పాపం అంత కష్టపడ్డా మారుతికి దక్కలేదు..!!

పాపం అంత కష్టపడ్డా మారుతికి దక్కలేదు..!!

సినిమా రిలీజ్ డేట్ ఒకటి ఫిక్స్ చేసుకుంటే.. ఆ డేట్ కు రావడానికి దర్శకులు సినిమాను రెడీ చేస్తుంటారు.  సాధ్యమైనంతవరకు చెప్పిన డేట్ కు సినిమాను రిలీజ్ చేయాలి.  ఆలస్యం జరుగుతుంది అనుకుంటే ముందుగానే ప్రకటించి డేట్ ను పోస్ట్ ఫోన్ చేసుకుంటారు.  

మారుతి విషయంలో మాత్రం అన్ని అనుకున్నట్టుగానే జరిగాయి.  రిలీజ్ డేట్ విషయంపై మారుతి చాలా ఫైట్ చేశాడు.  ఏది ఏమైనా సరే శైలజా రెడ్డి అల్లుడు రిలీజ్ ఆగస్టు 31 న విడుదల కావాల్సిందే అని పట్టుబట్టాడు.  ఈ ఆగస్టులోనే నాగచైతన్య రెండు సినిమాలు వస్తాయని ముందుగా అనుకున్నా సవ్యసాచి గ్రాఫిక్ వర్క్స్ పూర్తికాకపోవడంతో వాయిదా పడింది. శైలజా రెడ్డిని ఆగస్టు 31 డేట్ ఫిక్స్ ను చేసుకొని హమ్మయ్య అనుకున్నాడు మారుతి.  

సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నాడు.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ విషయం దగ్గర తేడా పడింది.  మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందరం సినిమాకు బీజీయం చేస్తున్న సమయంలో కేరళలో వర్షాలు ప్రారంభమయ్యాయి.  దీంతో పాటు దర్శకుడు మారుతి కూడా కేరళలోనే ఉండిపోవడంతో సినిమా అనుకున్న డేట్ కు రాలేకపోతున్నట్టు యూనిట్ ప్రకటించింది.  మారుతి కోట్లాది తెచ్చుకున్న ఆగస్టు 31 వ తేదీ, ఇప్పుడు వేరొకరి వశం కాబోతున్నదన్నమాట.