మారుతి డైరెక్షన్లో దేవరకొండ !

మారుతి డైరెక్షన్లో దేవరకొండ !

వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేసేందుకు దర్శకులు ఉత్సాహం చూపిస్తున్నారు.  ఇప్పటికే పూరి జగన్నాథ్ లాంటి దర్శకుల పేర్లు వినిపిస్తుండగా తాజాగా మరొక దర్శకుడు మారుతి పేరు కూడ దేవరకొండను డైరెక్ట్ చేయబోయే దర్శకుల జాబితాలో చేరినట్టు తెలుస్తోంది. 

ప్రస్తుతం 'శైలజారెడ్డి అల్లుడు' చిత్ర  పనుల్లో ఉన్న మారుతి త్వరలో యువీ క్రియేషన్స్ తో సినిమా చేయాలని అనుకుంటున్నారట.  ఈ చిత్రంలో విజయ్ హీరోగా నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం.  ఈ ప్రాజెక్టుకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.