నంబర్‌వన్‌ మేరీకోమ్‌...

నంబర్‌వన్‌ మేరీకోమ్‌...

ఆరు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన భారత మహిళా బాక్సింగ్‌ స్టార్ మేరీకోమ్‌ (36) వరల్డ్ నంబర్‌వన్‌గా నిలిచింది. అంతర్జాతీయ బాక్సింగ్‌ సంఘం (ఐబా) విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో ఆమె 48 కేజీ కేటగిరీలో నంబర్‌వన్‌గా నిలిచింది. మేరీకోమ్‌ గత నవంబర్‌లో ఆరోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ గెలిచింది. దీంతో మేరీ ఆ వెయిట్‌ కేటగిరీలో 1700 పాయింట్లతో అగ్రస్థానం పొందింది. ఒకోట 1700 పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది.