28న మెడిక‌ల్ షాపులు బంద్‌

28న మెడిక‌ల్ షాపులు బంద్‌

ఆన్‌లైన్‌లో మెడిస‌న్స్ అమ్మ‌డాన్ని అనుమ‌తించాల‌న్న ప్ర‌తిపాద‌న‌ను నిర‌సిస్తూ ఆల్ ఇండియా ఆర్గ‌నైజేష‌న్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్ర‌గిస్ట్స్ సంస్థ ఆధ్వ‌ర్యంలో మెడిక‌ల్ షాపులు ఈనెల 28న బంద్ పాటించాల‌ని నిర్ణ‌యించాయి. ఇంట‌ర్ నెట్ ద్వారా లేదా ఈ ఫార్మ‌సీల ద్వారా మెడిస‌న్స్ అమ్మ‌కాల‌ను అనుమ‌తించాల‌న్న‌ప్ర‌భుత్వం ప్ర‌తిపాద‌న‌ను తాము వ్య‌తిరేకిస్తున్నామ‌ని సంస్థ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.  మా విజ్ఞ‌ప్తిని ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక‌పోతే... తాము దేశ వ్యాప్త ఆందోళ‌న‌కు దిగుతామ‌ని సంస్థ అధ్య‌క్షుడు జెఎస్ షిండే అన్నారు.