సైరా సినిమాలో మెగా హీరో.. అదృష్టం ఎవరికో ..?

సైరా సినిమాలో మెగా హీరో.. అదృష్టం ఎవరికో ..?

సైరా సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  మెగాస్టార్ హీరోగా చేస్తున్న ఈ చారిత్రాత్మక సినిమాలో ఇప్పటికే అనేక ఫిల్మ్ ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు నటిస్తున్నారు.  అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చ సుదీప్ వంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తుండటం ప్రధాన ఆకర్షణగా మారింది.  తెల్లదొరలపై పోరాటం చేసిన సైరా నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.  

ఇక, మెగాస్టార్ తో కలిసి సినిమాలు చేయాలని చాలా మంది అనుకుంటారు.  కొందరికే అవకాశం దక్కుతుంది.  మెగా కుటుంబంలో చాలామంది హీరోలుగా ఇండస్ట్రీలో ఉన్నారు.  వీరిలోని ఒకరికి మెగాస్టార్ తో కలిసి నటించే అవకాశం దక్కబోతున్నట్టు తెలుస్తోంది.  ఇప్పటికే రామ్ చరణ్ సినిమాలో మెగాస్టార్ కనిపించాడు.  అంతకు ముందు మెగాస్టార్ శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో పవన్ తళుక్కున మెరిశారు.  మరి మెగాస్టార్ సైరా సినిమాలో ఏ హీరోకు అవకాశం వస్తుంది అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉన్నా.. అందుతున్న సమాచారాన్ని బట్టి అల్లు అర్జున్ కు అవకాశం దక్కే ఛాన్స్ ఉన్నట్టుగా కనిపిస్తోంది.  మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ అంటే.. బన్నీ కాదంటాడా చెప్పండి.  చూద్దాం ఎవరికి దక్కుతుందో..!!