అమ్మకు "చిరు" వందనం

అమ్మకు "చిరు" వందనం

ప్రపంచవ్యాప్తంగా మదర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. చాలా మంది తమ మాతృమూర్తులకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపి.. చిన్న చిన్న కానుకలు అందజేశారు. సామాన్యులే కాదు.. ప్రముఖులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. మెగాస్టార్‌గా అభిమానుల నీరాజనాలు అందుకున్న చిరంజీవి ప్రేక్షకులకు ఒక గొప్పనటుడే కావొచ్చు.. కానీ ఆయన కూడా ఒక తల్లికి బిడ్డే కదా.. అందుకే తనకు జన్మనిచ్చి ఇంతవాడిని చేసిన తల్లి అంజనా దేవికి మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపి ఆమె ఆశీస్సులు పొందారు చిరు. మెగాస్టార్‌తో పాటు తమ్ముడు నాగబాబు, ఇద్దరు సోదరీమణులు కూడా తల్లి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ అపురూప క్షణాన్ని పవన్ కల్యాణ్ మిస్సయ్యారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం పవన్ తిరుమలలో ఉన్నారు.