విజయ్ కోసం మెగాస్టార్ చిరంజీవి !

విజయ్ కోసం మెగాస్టార్ చిరంజీవి !

యువ సంచలనం విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'గీత గోవిందం' ఈ నెల 15న విడుదలై విజయవంతంగా నడుస్తున్న సంగతి తెలిసిందే.  పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలైంది తక్కువ స్క్రీన్లలోనే అయినా మంచి వసూళ్లను రాబడుతోంది.

దీంతో నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ 19వ తేదీ ఆదివారం సక్సెస్ సెలబ్రేషన్స్ ప్లాన్ చేసింది.  ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇప్పటికే చిరు సినిమాను చూసి దర్శకుడు పరశురామ్, హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలను మెచ్చుకున్న సంగతి తెలిసిందే.