ఛార్మికి `మెహ‌బూబా` ఇచ్చిన షాక్‌

ఛార్మికి `మెహ‌బూబా` ఇచ్చిన షాక్‌

ఆకాశ్ పూరీని రీలాంచ్ చేస్తూ పూరి జ‌గ‌న్నాథ్‌- ఛార్మి బృందం `మెహ‌బూబా` చిత్రం తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. కొడుకు కెరీర్ కోసం ఏ తండ్రీ చేయ‌నంత రిస్క్ చేశాడు పూరి. త‌న‌కు ఉన్న ఇళ్ల‌లో ఒక‌దానిని అమ్మి మ‌రీ ఈ సినిమాకి పెట్టుబ‌డి పెట్టాడు. ఇండో-పాక్ వార్ బ్యాక్‌డ్రాప్‌, పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యంలో ఆస‌క్తిక‌ర క‌థాంశాన్ని ఎంచుకుని `మెహ‌బూబా` చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఈ సినిమాలో ఆకాశ్ డేరింగ్‌& డ్యాషింగ్ పెర్ఫామెన్స్ అంద‌రికీ న‌చ్చింది. అయితే నెగెటివ్ రివ్యూల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద ఊహించ‌ని ఫ‌లితాన్ని చ‌విచూడాల్సొచ్చింది. మెహ‌బూబా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవ‌డాన్ని పూరి టీమ్ జీర్ణించుకోలేక‌పోతోంది. ముఖ్యంగా ఈ రిజ‌ల్ట్‌ పూరీకే కాదు, అటు ఛార్మికి అంతే పెద్ద షాక్‌నిచ్చిందిట‌. 

`మెహ‌బూబా` చిత్రాన్ని `పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌` బ్యాన‌ర్‌లో తెర‌కెక్కించారు. ఇందులో పూరి క‌నెక్ట్స్ ఎండీ ఛార్మి 6 కోట్ల మేర పెట్టుబ‌డులు పెట్టార‌ని తెలుస్తోంది. ఫ్లాప్ టాక్‌తో పెట్టిన పెట్టుబ‌డి తిరిగి రాలేదట‌. ఈ సినిమా నైజాం 9కోట్ల‌కు దిల్‌రాజు కొనుక్కున్నా.. ఆయ‌న‌ తెలివిగా అడ్వాన్స్ బేసిస్‌లో కొన్నారు. న‌ష్టాలొస్తే నిర్మాత‌లే భ‌రించే ప్రాతిప‌దిక‌న కొనుగోలు చేశార‌ట‌. అంటే ఇప్పుడు పూరి- ఛార్మినే న‌ష్టాలు భ‌రించాలని ట్రేడ్‌లో టాక్ న‌డుస్తోంది. మొత్తానికి మెహ‌బూబా షాక్ పూరి కంటే ఛార్మికి పెద్ద రేంజులో త‌గిలింద‌ని చెబుతున్నారు.