కిత్నే కెమెరా థే....

కిత్నే కెమెరా థే....

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఫిట్ నెస్ చాలెంజ్ ని స్వీకరించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఫిట్ నెస్ వీడియో విడుదల చేశారు. మోడీ ఛాలెంజ్ ను మిగతావారు స్వీకరించడం ఎలా ఉన్నా ఇంటర్నెట్ లో ఈ వీడియోపై సెటైర్ల జడివాన కురుస్తోంది. ప్రతి ఒక్కరూ తమ క్రియేటివిటీతో హాస్యం పండిస్తున్నారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఫిట్ నెస్ వీడియో...

 

కన్నుకొట్టి కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెట్టిన మలయాళ నటి ప్రియా వారియర్ మోడీ వ్యాయామం చూసి కొంటెగా గురిపెట్టి కాలుస్తున్నట్టు వచ్చిన ఇమేజ్ ఇప్పుడు వాట్సాప్ లో చక్కర్లు కొడుతోంది. మరొకరు బండరాతిపై వెల్లికిలా పడుకున్న మోడీని జలకన్యలా మార్చేశారు. 

ఇటీవల ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ తో సమావేశమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మోడీ వ్యాయామం గురించి వివరిస్తున్నట్టు వచ్చిన ఫోటో గిలిగింతలు పెడుతోంది. బండరాయిపై కాలు పెట్టిన మోడీ భంగిమను బాహుబలిలో ఏనుగును ఎక్కే సన్నివేశంతో పోల్చారు కొందరు. 

 

మోడీ బండరాతిపై పడుకొని కదలడంపై పడిన పంచ్ లు అన్నీఇన్నీ కావు. ఒక పెద్దావిడ మసాలా దినుసులు తీసుకొచ్చి నూరుతున్నట్టున్న పోస్టింగ్ బాగా పేలింది. మరొకరు మోడీ వ్యాయామం చేసేటపుడు వెనుక ఎన్ని కెమెరాలు పెట్టారో చూపించారు. దీనికి కిత్నే కెమెరా థే అంటూ శీర్షిక పెట్టి మోడీ వీడియోని శీర్షాసనం వేయించారు.