విండోస్ 7 యూజర్స్ కు మరో అవకాశం

విండోస్ 7 యూజర్స్ కు మరో అవకాశం

యూజర్స్ అవసరాలు, అలవాట్లను క్రమంగా తమ వైపు మళ్లించుకునేందుకు మైక్రోసాఫ్ట్ సంస్థ మరింత ఓపిగ్గా ఆఫర్స్ ప్రకటిస్తోంది. తాజాగా విండోస్ 7 ను 2023 వరకు సపోర్ట్ చేస్తామని, అయితే పొడిగించిన కాలానికి సాఫ్ట్ వేర్ అప్ డేట్ కోసం చార్జీలు వర్తిస్తాయని కంపెనీ పేర్కొంది. ఇక 2020-2023 వరకు ప్రతి యేటా ఈ చార్జీలు పెరుగుతాయని కూడా డిక్లేర్ చేసింది. అయితే చార్జీలు కట్టకపోయినా విండోస్ 7 వాడుకోవచ్చని.. కంపెనీ నుంచి సాఫ్ట్ వేర్ అప్ డేట్స్ మాత్రం అందుకోలేరంటూ షరతు విధించింది. 

గతంలో ఇలాంటి సపోర్టును 2020 జనవరి నుంచి నిలిపివేస్తామని ప్రకటించినా.. చాలా మంది మైక్రోసాఫ్ట్ యూజర్లు విండోస్ 7 దగ్గరే ఉండడంతో ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ లెక్కన యూజర్స్ విండోస్ 10 కు మారడానికి మరో ఐదేళ్ల సమయం పొడిగించినట్టయింది. మరోవైపు ఆఫీస్ 365 ప్రో ప్లస్ సబ్ స్క్రిప్షన్ ను 2023 జనవరి నుంచి అందుబాటులోకి తెస్తామని చెప్పారు.