ప్రముఖ వ్యాపారి జీపీ రెడ్డి ఇంటిపై సోదాలు

ప్రముఖ వ్యాపారి జీపీ రెడ్డి ఇంటిపై సోదాలు

హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి జీపీ రెడ్డి ఇంట్లో పోలీసులు హంగామా సృష్టించారు. ఎలాంటి వారెంట్ లేకుండా సోదాలు నిర్వహించేందుకు వెళ్లడంతో మాజీ ఎంపీ లగడపాటి తీవ్ర అభ్యంతరం తెలిపారు. జూబ్లీహిల్స్‌ లోని జీపీ రెడ్డి ఇంట్లో నిన్న అర్ధరాత్రి వెస్ట్‌జోన్ డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సివిల్ కేసు విచారణ అంటూ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ సోదాలు చేయడానికి వచ్చిన పోలీసులను అడ్డుకున్నారు. సెర్చ్‌ వారెంట్‌ లేకుండానే సోదాలు ఎలా నిర్వహిస్తారని ఆయన పోలీసులను ప్రశ్నించారు. సెర్చ్‌ వారెంట్‌ లేకుండానే తన మిత్రుడిని పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐజీ నాగిరెడ్డి భూవిషయంలో జీపీరెడ్డిని పోలీసులు బెదిరిస్తున్నారని, ఆయనకు అనుకూలంగానే పోలీసులు వ్యవహరిస్తున్నారని లగడపాటి ఆరోపించారు.