గల్ఫ్ కి తగ్గిన భారతీయుల వలసలు 

గల్ఫ్ కి తగ్గిన భారతీయుల వలసలు 

ఉద్యోగాల కోసం గల్ఫ్ కు వెళ్లే భారతీయుల వలసలు భారీగా తగ్గాయి. ఈ మేరకు ఇమ్మిగ్రేషన్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. 2017 డిసెంబర్ నుంచి 2018 నవంబర్ 30వరకు ఈ 11 నెలల్లో సుమారు 21 శాతం వలసలు తగ్గాయని ఇమ్మిగ్రేషన్ కార్యాలయం తెలిపింది. ఐదేళ్లలో పోల్చుకుంటే 2014లో సౌదీకి భారీగా వలసలు వెళ్లారు . ఆ ఏడాది 7.76 లక్షల మంది గల్ఫ్ కు వెళ్లారని లెక్కలు చెబుతున్నాయి. 2014తో పోల్చితే 2018 నాటికి సుమారు 62శాతం వలసలు తగ్గాయి. ఈ లెక్కలను బట్టి చూస్తే... గల్ఫ్ కు వెళ్లే వారి సంఖ్య తగ్గుతుందని అర్థమవుతోంది. 2018లో 1.03 మందికి మాత్రమే గల్ఫ్ కు వెళ్లేందుకు ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ లభించింది. ఇందులో ముఖ్యంగా సౌదీ అరేబియా, కువైట్ కు 65వేల మంది వెళ్లాగా , మిగిలిన గల్ఫ్ దేశాలకు 52 వేల మంది వెళ్లారు. 2017లో సౌదీ అరేబియా అత్యధికంగా భారతీయ ఉద్యోగులను, కార్మికులను ఆకర్షించింది.