ఆయన భార్యకే నచ్చడం లేదు... జనానికెలా నచ్చుతారు

ఆయన భార్యకే నచ్చడం లేదు... జనానికెలా నచ్చుతారు

కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ గా దామోదర్ రాజనర్సింహ ఆయన భార్యకే నచ్చడం లేదు.. జనానికేం నచ్చుతారని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. రాయికోడ్ లో  పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన... కాంగ్రెస్ నేతలు పదవుల కోసం ఆంధ్ర నాయకుల బానిసలుగా బతుకుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకం పోయిందని విమర్శించారు. 
రాజశేఖర్ రెడ్డి నీళ్లు తీసుకుపోతుంటే పదవుల కోసం పెదవి మూసింది ఉత్తమ్ కుమార్ రెడ్డి కదా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో తెలంగాణ అభివృద్ధి కోసం కిరణ్ కుమార్ రెడ్డి ఒక్క రూపాయి ఇవ్వను అన్నప్పుడు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన తోక పట్టుకొని పోయారని ఆరోపించారు. 24 గంటల కరెంటు తెలంగాణలో అసాధ్యం అన్నారు. కానీ కరెంట్ వెలుగులు తెలంగాణలో వచ్చాయని గుర్తు చేశారు. 4వేల మెగావాట్లతో యద్రాద్రి మిర్యాలగూడలో నిర్మిస్తున్నామని తెలిపారు. కానీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి థర్మల్ ప్రాజెక్టును బంద్ చేస్తా అన్నారని ఆరోపించారు. 24 గంటలు కరెంట్ ఇచ్చే పాలసీ కాంగ్రెస్ నాయకులకు నచ్చటం హరీష్ రావు విమర్శించారు.