బాబు పర్యటన.. మోడీకి నిద్రలేని రాత్రులు

బాబు పర్యటన.. మోడీకి నిద్రలేని రాత్రులు

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో ప్రధాని మోడీకి నిద్రలేని రాత్రులు గడుస్తున్నాయని మంత్రి కాల్వ శ్రీనివాస్ విమర్శించారు. ఈ ఆదివారం అయన అనంతపురంలో మాట్లాడుతూ... తెలుగోడితో పెట్టుకుంటే మళ్లీ ప్రధాని అయిన వారు ఏవరూ లేరన్నారు. నాలుగేళ్లు నమ్మిన టీడీపీ, ఏపీ ప్రజలను నయవంచనకు గురిచేసి మరోసారి మోడీ మాటాల గారడీని చాటుకున్నారన్నారు. ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా చిత్తశుద్ధితో నేరవేర్చలేదు. పోలవరంతో సహా అన్నీ ప్రాజెక్టులకు కేంద్రం సహకరించ లేదు. ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా అడుగడునా అవరోధాలు సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఏపీప్తె ఉన్న కక్షతో గుంటూరు సభలో మోడీ పచ్చి అబద్ధాలు చెప్పారు. సభకు వచ్చిన బీజేపీ నాయకులు.. వ్తెసీపీ నాయకుల సహకరం తీసుకోలేదా? అని మంత్రి ప్రశ్నించారు.