గత ప్రభుత్వాలు చుక్కలు చూపిస్తే.. మేము చెక్కులు ఇస్తున్నాం

గత ప్రభుత్వాలు చుక్కలు చూపిస్తే.. మేము చెక్కులు ఇస్తున్నాం

రైతుబంధు పథకంను తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలో ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో రైతులకు చెక్కులను పంపిణీ చేశారు మంత్రి కేటీఆర్. అనంతరం ఆయన మాట్లాడుతూ... దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు పథకంను తెలంగాణలో ప్రవేశ పెట్టాము అని అన్నారు. గత 30 ఏండ్లలో రైతులకు గత ప్రభుత్వాలు చుక్కలు చూపిస్తే, మేము 3 ఏళ్లలో చెక్కులు ఇస్తున్నాం అని తెలిపారు. రైతుబంధు పథకం కింద ఎకరానికి రూ. 4 వేల చొప్పున  చెక్కులను అందిస్తున్నామని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతుబంధు పథకం కింద 100 కోట్లు పంపిణీ చేస్తున్నాం అని తెలిపారు. వచ్చే యాసంగికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం అని హామీ ఇచ్చారు. వచ్చే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నుండే రైతులకు 5 లక్షల రైతు బీమా పథకం అమలు చేస్తున్నాం అని అన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న రైతుబంధు పథకం దేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు అమలు కావాలనేది మా ద్యేయం అని తెలిపారు.