హైదరాబాద్ మెగాసిటీగా అవతరిస్తుంది...

హైదరాబాద్ మెగాసిటీగా అవతరిస్తుంది...

2030 నాటికి హైదరాబాద్ మెగాసిటీగా అవతరిస్తుందన్నారు తెలంగాణ మంత్రి కేటీ రామారావు... ఎల్బీనగర్‌ కామినేని ఆస్పత్రి దగ్గర నిర్మించిన ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన మంత్రి... ఈ సందర్భంగా మాట్లాడుతూ... హైదరాబాద్‌లో అత్యంత వేగంగా ఎల్బీనగర్ విస్తరణతో పాటు అభివృద్ధి సాగుతోందన్నారు. 2030 వరకు హైదరాబాద్ మెగాసిటీగా అవతరిస్తుందని... దేశంలో మూడో స్థానానికి హైదరాబాద్‌ వెళ్లొచ్చు అన్నారు. మన సిటీకి చాలా ఫ్లై ఓవర్లు అవసరమన్న కేటీఆర్... అందుకే రూ. 23 వేల కోట్లతో ప్రణాళికను సిద్ధం చేవామని వెల్లడించారు. జాతీయ రహదారులను కూడా అభివృద్ధి చేస్తున్నామని... ఎల్బీనగర్ లో రూ. 450 కోట్ల ఖర్చుతో రోడ్లు అభివృద్ధి పనులు జరుగుతున్నట్టు తెలిపారు. కామినేని ఫ్లై ఓవర్‌లో ఎడమ వైపు ప్రారంభం చేశాము.. మరో 6 నెలల్లో కుడి వైపు ఫ్లై ఓవర్ పనులు పూర్తిచేస్తామన్నారు. అయితే ఎన్ని రహదారులు విస్తరించినా... ప్రైవేట్ వాహనాల రద్దీ తగ్గితేనే ట్రాఫిక్ సమస్య తగ్గుతుందన్నారు కేటీఆర్... కోటి మంది ఉంటే 50 లక్షల వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయని... దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడంలేదన్నారు. మరోవైపు ఆగస్టు 15న అమీర్‌పేట్ - ఎల్బీనగర్ రూట్‌లో మెట్రో రైలు ప్రారంభించాలని అనుకున్నాం... కానీ, కేంద్ర మెట్రో సేఫ్టీ అథారిటీ పర్మిషన్ రాకపోవడంతో... ఈ లైన్ సెప్టెంబర్ మొదటివారంలో ప్రారంభిస్తామని తెలిపారు కేటీఆర్.