ఉత్తమ్ ట్వీట్ కు వెంటనే స్పందించిన కేటీఆర్...

ఉత్తమ్ ట్వీట్ కు వెంటనే స్పందించిన కేటీఆర్...

స్పందించే హృదయం ఉండాలే కానీ... సమస్య ఏ విధంగానైనా తన దృష్టికి వస్తే వెంటనే స్పందించొచ్చు... ఈ విషయంలో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ముందుంటారు. ప్రజలు నేరుగా కలిసి తమ సమస్యలు చెప్పుకుంటేనే కాదు... సోషల్ మీడియాలో సమస్య ఆయన దృష్టికి వచ్చినా వెంటనే స్పందిస్తుంటారు కేటీఆర్. అయితే ఈ సారి సమస్య మంత్రి దృష్టికి తీసుకొచ్చింది కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి... ఇక ఉత్తమ్ ట్వీట్‌పై స్పందించిన కేటీఆర్... పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించడమే కాదు... ఉత్తమ్‌కు థ్యాంక్స్ కూడా చెప్పారు.

ట్వీట్‌ను పరిశీలిస్తే కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లాలో వృద్ధ దంపతులు పూరి గుడిసెలో నివసిస్తున్నారు... అయితే వారికి రూ.500 ఆస్తిపన్ను నోటీసు పంపించారు సంబంధిత అధికారులు... ఈ విషయాన్ని స్థానిక నేతలు ఉత్తమ్ దృష్టికి తీసుకురాగా... ఆ విషయాన్ని వివరిస్తూ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు టి.పీసీసీ చీఫ్... అయితే ఉత్తమ్ ట్వీట్‌కు గంటల వ్యవధిలో స్పందించిన తెలంగాణ ఐటీశాఖ మంత్రి... ఆ వృద్ధ దంపతులకు డబుల్ బెడ్రూమ్, ఆసరా పెన్షన్ ఇవ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు... ఈ సందర్భంగా సమస్యను తన దృష్టికి తెచ్చిన పీసీసీ చీఫ్‌కు థ్యాంక్స్ చెప్పారు కేటీఆర్..