మెరుగైన వైద్యమే లక్ష్యం: ల‌క్ష్మారెడ్డి

మెరుగైన వైద్యమే లక్ష్యం: ల‌క్ష్మారెడ్డి

తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించటమే లక్ష్యమని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ ‌శాఖ మంత్రి డాక్టర్ సి. ల‌క్ష్మారెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన రోజ‌నీ కంటి ద‌వాఖానాలో ఐ బ్యాంకుని ప్రారంభించారు. రూ.కోటి విలువ చేసే అత్యాధునిక ప‌రిక‌రాలను రోజ‌నీ కంటి ద‌వాఖానాలో మంత్రి ప్రారంభించారు. కొత్త ఎసీ పోస్టు ఆప‌రేటివ్ వార్డు, నేత్రాల సేక‌ర‌ణ‌కు అంబులెన్స్‌ ని ప్రారంబించారు. అనంతరం మంత్రి ల‌క్ష్మారెడ్డి మాట్లాడుతూ... ఐ బ్యాంకు ఏర్పాటుతో కలెక్ట్ చేసిన కళ్ళను 2 నెలల వరకు నిలువ ఉంచవచ్చని తెలిపారు. కళ్ళను దానం చేయటం ద్వారానే అంధత్వ నివారణ సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగు పరుస్తున్నామని తెలిపారు. తెలంగాణా డయాగ్నోసిస్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించటమే లక్ష్యమని మంత్రి ల‌క్ష్మారెడ్డి అన్నారు. కార్పొరేట్  సోషల్ రెస్పాన్స్ కింద అందరూ ముందుకు వస్తే.. సర్కార్ ఆస్పత్రులను అభివృద్ది చేస్తామని మంత్రి తెలిపారు.