ఎలక్ట్రానిక్ కంపెనీలకు భూమి పూజ చేసిన మంత్రులు

ఎలక్ట్రానిక్ కంపెనీలకు భూమి పూజ చేసిన మంత్రులు

రేణిగుంట ఎయిర్ పోర్ట్ సమీపంలో ఈఎంసి1లో కార్బన్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమను మంత్రులు నారా లోకేష్, అమరనాథ్ రెడ్డిలు ప్రారంభించారు. అనంతరం ఈఎంసి2లో మరో పది ఎలక్ట్రానిక్స్  కంపెనీల ఏర్పాటుకు మంత్రులు భూమి పూజ చేశారు. తిరుపతి కార్బన్ మొబైల్స్ తయారీ యూనిట్ లో 'కార్బన్ పి9 ప్రో' మోడల్ మొబైల్ ఫోన్ ను మంత్రులు, కార్బన్ చైర్మన్ సుధీర్, తదితరులు ఆవిష్కరించారు. ఆపై తిరుపతి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ 1లో 80 కోట్ల పెట్టుబడితో 700 మందికి ఉద్యోగాలు కల్పిస్తూ ఏర్పాటు అయిన కార్బన్ మొబైల్స్ తయారీ కంపెనీని మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు.

మొత్తంగా 1,445 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రానిక్స్ కంపెనీల ఏర్పాటు అవుతుండగా.. అందులో 7,088 మందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. మరోవైపు తిరుపతిలో 653 కోట్ల పెట్టుబడి పెట్టి 1,680 మందికి ఉద్యోగ అవకాశాలు వోల్టాస్ కంపెనీ కల్పించనుంది. 145 కోట్ల పెట్టుబడితో 1,131 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తూ ఈఎంసి 2 లో మరో ప్లాంట్ ను డిక్సన్ ఏర్పాటు చేస్తోంది.