జగన్ దొంగబ్బాయి... వైసీపీ డ్రామా కంపెనీ...

జగన్ దొంగబ్బాయి... వైసీపీ డ్రామా కంపెనీ...

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ దొంగబ్బాయి... ఆ పార్టీ ఓ డ్రామా కంపెనీ అంటూ ఎద్దేవా చేశారు ఏపీ మంత్రి నారా లోకేష్... అనంతపురంలో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ... భారతీయ జనతా పార్టీ చెప్పినట్టూ వింటూ వైసీపీ నేతలు నాటకాలు వేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించే దమ్ము ప్రతిపక్ష నేతలకు లేదన్న నారా లోకేష్... ధైర్యముంటే వైఎస్ జగన్, పవన్ కల్యాణ్... ప్రధాని మోడీని నిలదీయాలని సూచించారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి నారా లోకేష్... ఏ తప్పూ చేయని చంద్రబాబును ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మంత్రి... రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి, మత విద్వేషాలు రెచ్చగొట్టడానికీ ప్రయత్నాలు జరుగుతున్నాయి... జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. అనంతపురం జిల్లాకు మా కుటుంబంలో ప్రత్యేక స్థానం ఉందన్నారు నారా లోకేష్... తాత ఎన్టీఆర్‌ను, మామయ్య హరికృష్ణను... అందరికీ బాలయ్య, నాకు ముద్దుల మామయ్య బాలకృష్ణనూ శాసనసభకు పంపిన జిల్లా అనంతపురం జిల్లా అన్నారు. రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా... ఇచ్చిన హామీలన్నీ అమలుచేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే అన్నారు.