విషమంగానే మధులిక పరిస్థితి..

విషమంగానే మధులిక పరిస్థితి..

ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మైనర్ బాలిక మధులిక పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. మరో 24 గంటలు దాటితే తప్ప ఆరోగ్యపరిస్థితిపై ఏమీ చెప్పలేమంటున్నారు వైద్యులు. ఇప్పటికే బాలికకు మైనర్ సర్జరీలు నిర్వహించారు. మైనర్ ఆపరేషన్‌తో పాటు, ప్లాస్టిక్ సర్జరీ చేసింది వైద్యుల బృందం. ఐదుగురు సభ్యులు గల సర్జరీ డాక్టర్ల టీంతో క్లోజ్ అబ్జర్వేషన్‌లో ఉంచారు. సర్జరీ అనంతరం బాలికను ఐసీయూకి షిఫ్ట్ చేశారు. దశలవారీగా బాలికకు శస్త్ర చికిత్సలు చేయాల్సి ఉంది. మరో 24 గంటలు దాటితే తప్ప బాలిక మెదడుకు సంబంధించిన మేజర్ ఆపేరేషన్ పై నిర్ణయం తీసుకోలేమంటున్నారు వైద్యులు.