ఎండాకాలంలో రైతాంగానికి నీళ్లు ఇచ్చేలా కృషి చేస్తున్నాం: ఈటెల

ఎండాకాలంలో రైతాంగానికి నీళ్లు ఇచ్చేలా కృషి చేస్తున్నాం: ఈటెల

ఎండాకాలంలో కూడా రైతాంగానికి నీళ్లు ఇచ్చేలా కృషి చేస్తున్నాం అని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ... ఎస్సారెస్పీ ద్వారా 14లక్షల 40 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సి ఉంది. గతంలో 5 లక్షల ఎకరాల కంటే ఎక్కువ నీళ్లు ఇవ్వలేదు. ఇప్పటికే తొవ్వబడ్డ కాల్వలకు 3వేల క్యూసెక్కుల కెపాసిటీ నుండి 6 వేల క్యూసెక్కుల నీరు వదిలి టెస్ట్ చేశాం. జరుగుతున్న పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సమావేశంలో చర్చిస్తున్నామన్నారు. డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ ను బలోపేతం చేసుకోవాల్సి ఉందన్నారు. అధికారికంగా చెరువులు, కుంటలు నింపాలని సీఎం చెప్పారు. దాని ద్వారా భూగర్భ జలాలు, మత్స్య సంపద పెరుగుతుందని ఈటెల రాజేందర్ అన్నారు.

జూన్ 30 వరకు కేటాయించిన నిధులు 100 శాతం ఖర్చు చేస్తాం. అవసరం అయితే మరిన్ని నిధులు తెచుకుంటాం అని ఈటెల రాజేందర్ తెలిపారు. ఎండాకాలంలో రైతాంగానికి నీళ్లు ఇచ్చేలా కృషి చేస్తున్నామన్నారు. కొన్ని చోట్ల భూ సేకరణలో సమస్యలు ఉన్నాయి, వాటిపైన పూర్తి దృష్టి సారిస్తాం. వర్షాకాలనికి గౌరవెళ్లి వరకు నీళ్లు తీసుకెలతాం. కాళేశ్వరం నీళ్లు వీటికి అనుసంధానం కాబోతున్నాయన్నారు. చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇస్తాం. పనులు ఎక్కడా ఆగలేదు, వేగంగా జరిగేలా ప్రజాప్రతినిధులం కృషి చేస్తున్నాం. రబీకి ఫిబ్రవరి 10 నుండి లోయర్ మానేరు కింది పంటలకు నీళ్లు ఇస్తాం అని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.