రైతుబంధులో అన్నీ అవకతవకలే...

రైతుబంధులో అన్నీ అవకతవకలే...

రైతుబంధు పథకంలో అన్నీ అవకతవకలే అని జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆయన ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ... భూ రికార్డుల ప్రక్షాళన కొత్త కార్యక్రమం ఏమీ కాదు, గతంలో జరిగినవే అని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ప్రచారార్భాటాలు చేస్తుంది అని విమర్శించారు. సారంగపూర్ మండలంలోని అర్పపెల్లిలో రైతుబంధు పథకంలో అవకతవకలు జరిగాయి, కొత్త పుస్తకాలలో అన్ని పొరపట్లే అని అన్నారు. రాయికల్ మండలంలో 20 శాతం పట్టాదారు పాస్ బుక్ లో అవినీతి జరిగిందన్నారు. యజమాన్యపు హక్కును తీసివేసే హక్కు ప్రభుత్వానికి లేదు, ఈ విషయమై స్టేట్ చీఫ్ ల్యాండ్ కమిషినర్ కి పిర్యాదు చేస్తాను అని తెలిపారు.

మద్దతు ధర, గిట్టుబాటు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రభుత్వం గుర్తుంచాలి కానీ.. కేంద్రం పేరు చెపుతూ రైతులకు అన్యాయం చేస్తుంది అని ఎద్దేవా  చేశారు. కౌల్ రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వకపోవడం అన్యాయం అని అన్నారు. వెంటనే కౌలు రైతులకు పెట్టుబడి రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉచిత విద్యుత్తును అమలు చేసి తెలంగాణ రైతాంగానికి ఆత్మస్థైర్యం నింపింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. దీర్ఘకాలిక రుణాలకు రాయితిని వెంటనే మంజూరు చేయాలి అని డిమాండ్ చేశారు. గిరిజనులకు పట్టాదారు పసుపుస్తకాలు ఇవ్వాలన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలలో జరిగిన తప్పులపై సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.