కాంగ్రెస్‌కు ఎమ్మెల్యే రాజీనామా..

కాంగ్రెస్‌కు ఎమ్మెల్యే రాజీనామా..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్‌లో డీసీసీ అధ్యక్షుడి నియామకం చిచ్చుపెట్టింది. జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా మాజీమంత్రి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును నియమించింది పార్టీ అధిష్టానం. అయితే, అధ్యక్ష పదవి ఆశించిన పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీంతో పీసీసీ ప్రధాన కార్యదర్శి పదవికి, వరంగల్ జిల్లా ఇంచార్జ్ పదవికి రాజీనామా చేశారు. పార్టీ పదవుల్లో ఆదివాసీలకు ప్రాధాన్యమివ్వాలని గతంలోనే అధిష్ఠానానికి విన్నవించినా ఫలితం లేదని, గిరిపుత్రులకు న్యాయం జరగడం లేదని మండిపడ్డారు రేగా కాంతారావు. తన రాజీనామా పత్రాలను టి.పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి పంపనున్నట్టు వెల్లడించిన రేగా... ఇక నుంచి కాంగ్రెస్ పార్టీలో సాధారణ కార్యకర్తల కొనసాగుతానని ప్రకటించారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్... ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభావాన్ని చూపలేకపోయింది. మరోవైపు ఇతర పార్టీల ఎమ్మెల్యే... టీఆర్ఎస్‌లో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతున్న వేళ... రేగా కాంతారావు కాంగ్రెస్ పార్టీ పదవులకు రాజీనామా చేయడం చర్చనీయంగా మారింది.